రోడ్డు ప్రమాదంలో లోకాయుక్తా ఎస్పీ మృతి | Mysore Lokayukta SP killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో లోకాయుక్తా ఎస్పీ మృతి

Feb 23 2017 9:44 AM | Updated on Aug 30 2018 4:10 PM

బెంగుళూరు-మైసూరు రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది.

బెంగుళూరు: బెంగుళూరు-మైసూరు రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న లోకాయుక్తా ఎస్పీ, కారు డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోకాయుక్తా మైసూర్‌ విభాగానికి చెందిన ఎస్పీ రవికుమార్‌ బుధవారం బెంగుళూరు వెళ్లారు. అనంతరం రాత్రి మైసూరుకు తిరిగి వెళ్తుండగా రామోహళ్లి సమీపంలో డివైడర్‌ను ఢీ కొట్టింది.
 
ఆ తర్వాత ఎదురుగా వస్తున్న టిప్పర్‌, ఆటోలను ఢీ కొట్టడంతో కారు నుజ్జుయింది. కారులో ప్రయాణిస్తున్న ఎస్పీ రవికుమార్‌, కారు డ్రైవర్‌ కిరణ్‌లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న కంబళగూడు పోలీసులు మృతదేహాలను స్ధానిక రాజరాజేశ్వరి ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement