హోటల్‌లో ఓ యువతి హత్య | Murder of a young woman in hotel | Sakshi
Sakshi News home page

హోటల్‌లో ఓ యువతి హత్య

Oct 26 2013 12:02 AM | Updated on Jul 30 2018 8:27 PM

శాంతాక్రజ్‌లోని ఒక హోటల్ గదిలో ఓ యువతి హత్యకు గుర య్యింది.

సాక్షి, ముంబై: శాంతాక్రజ్‌లోని ఒక హోటల్ గదిలో ఓ యువతి హత్యకు గుర య్యింది. మృతదేహాన్ని గుర్తించిన నిర్వాహకులు పోలీ సులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతురాలిని రషీదా సూరత్‌వాలాగా గుర్తించారు. రషీదా గురువారం మధ్యాహ్నం మరదలు అమీనా పుల్లాతో కలసి మిలన్ ఇంటర్నేషనల్ హోటల్‌కు వచ్చింది. కొంత సమయం తర్వాత అమీనా వెళ్లిపోయింది. రషీదా షాహీద్ షేక్ అనే యువకుడిని కలిసేందుకు హోటల్‌లోనే ఒక రూమ్‌లో ఉంది. సాయంత్రం సుమారు 6.15 గంటలకు తిరిగి వచ్చిన అమీనాకు రషీదా మృత దేహం కనిపించింది. ఓణీతో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement