'అమ్మ ఆశీస్సులతో అత్యుత్తమ జట్టు ఎంపిక చేస్తా' | msk prasad visits durga temple in vijayawada | Sakshi
Sakshi News home page

'అమ్మ ఆశీస్సులతో అత్యుత్తమ జట్టు ఎంపిక చేస్తా'

Oct 5 2016 10:45 AM | Updated on Sep 4 2017 4:17 PM

'అమ్మ ఆశీస్సులతో అత్యుత్తమ జట్టు ఎంపిక చేస్తా'

'అమ్మ ఆశీస్సులతో అత్యుత్తమ జట్టు ఎంపిక చేస్తా'

అమ్మవారి ఆశీస్సులతో అత్యుత్తమ జట్టును ఎంపిక చేస్తానని టీమిండియా సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు.

విజయవాడ : అమ్మవారి ఆశీస్సులతో అత్యుత్తమ జట్టును ఎంపిక చేస్తానని టీమిండియా సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. బుధవారం విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వరస్వామివారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్ చినరాజప్ప దంపతులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.

వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇదిలా ఉంటే దసరా ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఐదో రోజు అమ్మవారు కాత్యాయనీ దేవి రూపంలో దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు.

Advertisement
 
Advertisement
Advertisement