విద్యుత్ సమస్య రానీయం | minister jagadish reddy visits yadagirigutta | Sakshi
Sakshi News home page

విద్యుత్ సమస్య రానీయం

Dec 7 2016 11:32 AM | Updated on Sep 18 2018 8:37 PM

యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో 11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను తెలంగాణ విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు.

యాదగిరిగుట్ట : యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో 11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను తెలంగాణ విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తోందన్నారు. నాణ్యమైన విద్యుత్‌ను రైతులకు అందిస్తామన్నారు. ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. అలాగే ఆలేరు ప్రాంతాన్ని సస్యశ్యామలంగా తీర్చుదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement