రోడ్డు ప్రమాదాలపై చినరాజప్ప దిగ్ర్బాంతి | minister chinarajappa enquiry on road accidents in rangareddy and srikakulam districts | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాలపై చినరాజప్ప దిగ్ర్బాంతి

May 12 2017 11:15 AM | Updated on Aug 30 2018 4:10 PM

రంగారెడ్డి, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలపై మంత్రి నిమ్మకాయల చినరాజప్ప దిగ్ర‍్బాంతి వ్యక్తం చేశారు.

విజయవాడ: రంగారెడ్డి జిల్లా, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల పట్ల ఉప ముఖ్యమంత్రి, ఏపీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప దిగ్ర‍్బాంతి వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లాకు చెందిన అయిదుగురు వ్యక్తులు మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆ జిల్లా పోలీసు అధికారులను సంప్రదించి మృతదేహాలను వారి స్వస్ధలాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీని ఆదేశించారు.
 
అలాగే  శ్రీకాకుళం జిల్లాలో పెళ్ళి బృందం బస్సు చెట్టును ఢీకొట్టిన ఘటనపై కూడా ఆయన వివరాలు తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీతో చినరాజప్ప ఫోనులో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement