ఎమ్మెల్యేలతో మరోసారి చిన్నమ్మ మంతనాలు | Meeting between VKSasikala, MLAs at Golden Bay resort | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలతో మరోసారి చిన్నమ్మ మంతనాలు

Feb 12 2017 7:14 PM | Updated on May 24 2018 12:08 PM

ఎమ్మెల్యేలతో మరోసారి చిన్నమ్మ మంతనాలు - Sakshi

ఎమ్మెల్యేలతో మరోసారి చిన్నమ్మ మంతనాలు

అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ మరోసారి పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.

చెన్నై: అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ మరోసారి పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఆదివారం చెన్నై నుంచి కువతూర్ సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్‌కు వెళ్లారు. గోల్డెన్ బే రిసార్ట్‌ క్యాంపులో ఉంటున్న ఎమ్మెల్యేలతో శశికళ సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించకపోవడం, కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం శిబిరంవైపు పార్టీ నేతలు వెళ్తుండటం వంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చర్చించినట్టు సమాచారం.

శశికళ నిన్న (శనివారం) కూడా గోల్డెన్ బే రిసార్ట్‌కు వెళ్లి ఎమ్మెల్యేలతో చర్చించిన విషయం తెలిసిందే. నిర్ణయం తీసుకోవడంలో గవర్నర్ జాప్యం చేస్తుండటం, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేజారి పోతుండటంపై శశికళ వర్గం ఆందోళన చెందుతోంది. శశికళ ఎమ్మెల్యేలతో కలసి వెళ్లి రాజ్భవన్ ఎదుట పరేడ్ నిర్వహించనున్నట్టు వార్తలు వచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement