ఎయిర్‌పోర్టు రోడ్డులో భారీ ధర్నా | massive protest in the Airport Road | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టు రోడ్డులో భారీ ధర్నా

Oct 4 2016 1:33 PM | Updated on Mar 28 2018 11:26 AM

కొత్తగా ప్రకటించిన జిల్లాలో శంషాబాద్‌కు అదే పేరు కొనసాగించాలంటూ భారీ ధర్నా జరిగింది.

కొత్తగా ప్రకటించిన జిల్లాల జాబితాలో ఉన్న శంషాబాద్‌కు అదే పేరు కొనసాగించాలంటూ భారీ ధర్నా జరిగింది. మంగళవారం ఉదయం అంతర్జాతీయ విమానాశ్రయం రోడ్డులో అఖిలపక్షాల నేతలు రాస్తారోకోకు దిగారు. దీంతో రెండు వైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రంగ ప్రవేశం చేసిన పోలీసులు నిరసన సాగిస్తున్న కొందరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది. ఈ కారణంగా ఈ మార్గంలో గంటకు పైగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

 

Advertisement
 
Advertisement
Advertisement