తంజావూరులో మరియమ్మ విగ్రహం చోరీ | mariamman statue robbery in thanjavur | Sakshi
Sakshi News home page

తంజావూరులో మరియమ్మ విగ్రహం చోరీ

Jan 27 2017 11:57 AM | Updated on Aug 30 2018 5:27 PM

పురాతన ఆలయంలోని మరియమ్మ అమ్మవారి కాంస్య విగ్రహం చోరీకి గురైంది.

తంజావూరు: పురాతన ఆలయంలోని మరియమ్మ అమ్మవారి కాంస్య విగ్రహం చోరీకి గురైంది. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. ఆలయ తలుపులు పగలగొట్టి గుర్తుతెలియని దుండగులు సుమారు 20 కిలోల బరువైన అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం పూజలు నిర్వహించడానికి గుడికి వెళ్లిన స్థానికులు చోరీ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. వందల ఏళ్లనాటి మరియమ్మ అమ్మవారి విగ్రహం ఖరీదు లక్షల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement