వికారాబాద్ జిల్లా బషీరాబాద్ తహశీల్దార్ కార్యాలయం వద‍్ద బుధవారం ఒక వ‍్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత‍్మహత‍్యకు యత్నించడం కలకలం రేపింది.
ఇసుక పర్మిట్లు ఇవ్వలేదని ఆత‍్మహత్యాయత‍్నం
Feb 15 2017 1:00 PM | Updated on Aug 29 2018 8:38 PM
బషీరాబాద్: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ తహశీల్దార్ కార్యాలయం వద‍్ద బుధవారం ఒక వ‍్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత‍్మహత‍్యకు యత్నించడం కలకలం రేపింది. ఇల్లు కట్టుకునేందుకు ఇసుకకు పర్మిట్ ఇమ‍్మని ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని విసుగుచెందిన అంబాజీ అనే వ‍్యక్తి బుధవారం ఉదయం కిరోసిన్ క్యాన్‌తో తహశీల్దార్ కార్యాలయానికి వచ్చాడు.
అధికారులు చూస‍్తుండగానే కిరోసిన్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. సమాచారాన్ని పోలీసులకు అందించారు. వెంటనే సంఘటన స‍్థలానికి వచ్చిన పోలీసులు అంబాజీని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తాండూరు సబ్‌కలెక‍్టర్ కార్యాలయానికి వెళ్ళినా తనకు ఇసుక పర్మిట్ లభించలేదని బాధితుడు పేర‍్కొన్నాడు.
Advertisement


