మదురై మీనాక్షి ఆలయానికి బాంబు బెదిరింపు | Madurai Meenakshi temple bomb threat | Sakshi
Sakshi News home page

మదురై మీనాక్షి ఆలయానికి బాంబు బెదిరింపు

Jul 27 2014 11:40 PM | Updated on Oct 8 2018 4:05 PM

మదురై మీనాక్షి ఆలయానికి బాంబు బెదిరింపు - Sakshi

మదురై మీనాక్షి ఆలయానికి బాంబు బెదిరింపు

మదురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన బాంబు బెదిరింపుతో కలకలం రేగింది. తేని జిల్లా పెరియకుళంకు చెందిన యువకుడి సెల్‌ఫోన్‌కు శనివారం

 ప్యారిస్: మదురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన బాంబు బెదిరింపుతో కలకలం రేగింది. తేని జిల్లా పెరియకుళంకు చెందిన యువకుడి సెల్‌ఫోన్‌కు శనివారం సాయంత్రం ఓ గుర్తుతెలియని వ్యక్తి తన సెల్‌ఫోన్ నుంచి స్కైప్ ద్వారా మాట్లాడారు. మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో కొంత సేపటిలో బాంబు పేలుతుందని తెలిపి ఫోన్ కట్‌చేశాడు. ఆందోళన చెందిన ఆ యువకుడు తేని ఎస్పీ కార్యాలయానికి సమాచారం అందించాడు. తేని పోలీసులు మదురైలో ఉన్న ఆలయ నిర్వాహకం, సీబీసీఐడీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
 దీంతో బాంబు స్క్వాడ్ నిపుణులు, జాగిలాలతో ఆలయానికి చేరుకున్నారు. అక్కడ మీనాక్షి అమ్మవారి ఆలయం లోపల, ఆలయం బయట రెండు గంటల సేపు తనిఖీల్లో నిర్వహించారు. బాంబు ఉన్నట్లు ఆచూకీ కనిపించకపోవడంతో అది బాంబు బూచి అని తెలిసింది. శనివారం ఆడి అమావాస్య రోజు కావడంతో ఆలయానికి వేలాది మంది భక్తులు వచ్చారు. తనిఖీల సమయంలో భక్తులను లోపలికి అనుమతించ  లేదు. తనిఖీలు పూర్తయిన తర్వాతనే భక్తులను అమ్మవారి దర్శనార్థం ఆలయంలోకి అనుమతించారు. బాంబు బెదిరింపు ఇచ్చిన వ్యక్తి కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోలీసులు ఆలయ భద్రతను మరింత పటిష్ఠం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement