పెళ్లి మండపంలో బాంబు బెదిరింపు.. పారిపోయిన వధూవరులు! | Bomb Threat At Wedding Hall Sparks Chaos During Ceremony, Bride and Groom Flee Amid Panic, Police Confirms Its Fake | Sakshi
Sakshi News home page

పెళ్లి మండపంలో బాంబు బెదిరింపు.. పారిపోయిన వధూవరులు!

Mar 26 2026 12:02 PM | Updated on Mar 26 2026 12:35 PM

Bomb Threat at Wedding Hall: Bride and Groom Flee Amid Panic Turns Out Fake

అన్నానగర్‌:  దిండుక్కల్‌–తిరుచ్చి బైపాస్‌ రోడ్డులో ఒక ప్రసిద్ధ వివాహ మండపం ఉంది. బుధవారం ఈ మండపంలో ఒక వివాహం జరగాల్సి ఉంది. బుధవారం ఉదయం, వరుడిని ఆహ్వానించడంతో పాటూ ఇతర కార్యక్రమాలు జరిగాయి, అనంతరం వధూవరులకు పూలమాలలు వేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో, పెళ్లి మండపంలో బాంబు పెట్టారనే వార్త అకస్మాత్తుగా వ్యాపించింది. దీంతో పెళ్లికి వచ్చిన అతిథులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

 ఈ విషయం దాడికొంబు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు బాంబు నిపుణులతో సంఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు. పెళ్లికి వచ్చిన అతిథులందరూ ప్రాణాలతో బయటపడాలనే ఆశతో హాలులోంచి బయటకు పరుగులు తీశారు. అంతేకాకుండా, వధూవరులను వారి బంధువులు తాళీ కట్టకుండానే బయటకు తీసుకువచ్చారు. అనంతరం తనిఖీలు చేశారు. బాంబు బూచీ ఒత్తిటే అని తేల్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement