ప్రేమ పెళ్లి ఎంత పనిచేసింది? | love marriage claims groom father life in karnataka | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లి ఎంత పనిచేసింది?

Mar 6 2017 7:49 PM | Updated on Sep 5 2017 5:21 AM

ప్రేమ జంట  సురేష్, మహేశ్వరి

ప్రేమ జంట సురేష్, మహేశ్వరి

పెద్దల మాట పెడచెవిన పెట్టి కర్ణాటకలో ఓ జంట ప్రేమ వివాహం చేసుకుంది.

క్రిష్ణగిరి(సూళగిరి): పెద్దల మాట పెడచెవిన పెట్టి కర్ణాటకలో ఓ జంట ప్రేమ వివాహం చేసుకుంది. బంధువులు వారిని గ్రామానికి తీసుకొచ్చి పంచాయితీ పెట్టి విడిపోవాలని సూచించారు. దీంతో ఆ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో ప్రియున్ని కిడ్నాప్‌ చేశారు. విషయం తెలుసుకొన్న ప్రియుని తండ్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ సంఘటన సూళగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది.

సూళగిరి తాలూకా కొడితిమ్మనపల్లి గ్రామానికి చెందిన బసప్ప కొడుకు సురేష్‌(21) ప్లస్టూ వరకు చదువుకొని బెంగళూరులో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మహేశ్వరి(21) డిగ్రీ వరకు చదువుకుంది. ఏడాది కాలంగా వీరి మధ్య ప్రేమాయణం సాగుతోంది. గత నెల 17వ తేదీ బెంగళూరులోని కణ్ణమ్మ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకొన్న ఇరువర్గాల బంధువులు వారికి నచ్చజెప్పి శనివారం స్వగ్రామానికి  తీసుకొచ్చి పంచాయితీ ఏర్పాటు చేసి విడిపోవాలని సూచించారు. దీంతో ప్రేమ జంట సూళగిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు.

పోలీసులు రాత్రి సమయంలో స్టేషన్‌లో ఉంచమని, ఉదయం రావాలని సూచించడంతో సూళగిరిలోని ఓ మిత్రుని ఇంట్లో బసచేసి ఉదయం పోలీస్‌స్టేషన్‌కు వెళుతుండగా బంధువులు సురేష్‌ను కిడ్నాప్‌ చేశారు. తన భర్తను కిడ్నాప్‌ చేశారని మహేశ్వరి సూళగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకొన్న సురేష్‌ తండ్రి, గతంలో కూతురు కూడా ప్రేమ వివాహం చేసుకోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఉదయం ఉరేవేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. సూళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement