సూపర్‌స్టార్‌తో కత్రినా కైఫ్ | Katrina Kaif Pair with Rajinikanth For Robo 2 | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్‌తో కత్రినా కైఫ్

Aug 29 2015 2:51 AM | Updated on Sep 3 2017 8:18 AM

సూపర్‌స్టార్‌తో కత్రినా కైఫ్

సూపర్‌స్టార్‌తో కత్రినా కైఫ్

బ్రహ్మాండాలకే కాదు క్రేజీ కాంబినేషన్‌లకు కేరాఫ్ స్టార్ దర్శకుడు శంకర్ అన్నంతగా ఆయన చిత్రాలు ఉంటాయి. అలాగా ఆయన చిత్రాల్లో

 బ్రహ్మాండాలకే కాదు క్రేజీ కాంబినేషన్‌లకు కేరాఫ్ స్టార్ దర్శకుడు శంకర్ అన్నంతగా ఆయన చిత్రాలు ఉంటాయి. అలాగా ఆయన చిత్రాల్లో కథానాయకులతో పాటు కథానాయికలకు ప్రాధాన్యత ఉంటుంది. అందుకే శంకర్ చిత్రాల లో నటించడానికి టాప్ హీరోయిన్లు ఎవ్వరూ నో చెప్పే సాహసం చె య్యరు. ఇంకా చెప్పాలం టే ఆయన చిత్రాల్లో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. ఇక కారణాలేమోగానీ ఈ అద్భుత చిత్రా ల సృష్టికర్త ఎ క్కువ గా హింది హీరోయిన్ల పైనే దృష్టి పెడతారు. తన తొలి చిత్రం నుంచీ గమనిస్తే ఈ విషయం స్పష్టం గా అర్ధం అవుతుంది. శంకర్ తొలి చిత్రం జెంటిల్‌మెన్ చి త్రంలో అర్జున్ సరసన బాలీ వుడ్ భామ మధుబాలను ఎంచుకున్నారు.
 
  ఆ తరువా త కాదలన్ చిత్రంలో నగ్మా ను, ఇండియన్ చిత్రంలో మనీషాకోయిరాల,ఊర్మిళలను, జీన్స్ చిత్రంలో అప్పటి ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌ను, అన్నియన్ చిత్రంలో సదాను,బాయ్స్ చిత్రంలో జెనీలియాను, ఎందిరన్ చిత్రంలో మరో సారి ఐశ్వర్యారాయ్‌ను, నన్భన్ చిత్రంలో ఇలియానా అంటూ దాదాపు తన చిత్రాల్లో హిందీ కథానాయికలనే ఎంచుకున్నారు.ఒక్క ఐ చిత్రంలో మాత్రం విదేశీ బ్యూటీ(కెనడా)ఎమీజాక్సన్ ను సెలక్ట్ చేసుకున్నారు. ఇప్పటికీ శంకర్ ఈలోచనా ధోరణిలో మార్పులేదు. తన తాజా చిత్రానికి బాలీవుడ్ భామనే ఎంపిక చేసుకున్నట్లు లేటెస్ట్ సమాచారం.
 
 శంకర్ ఇప్పుడు ఎందిరన్-2 చిత్ర కథను వండడంలో పూర్తిగా నిమగ్నమైపోయారు. దీని కోసం ఆయనిప్పు డు ఎక్కువ కాలం ముంబయ్‌లోనే మకాం పెడుతున్నా రు. ఈ చిత్రాన్ని సుమారు 300 కోట్ల బడ్జెట్‌తో బ్రహ్మాం డంగా తెర కెక్కించడానికి సన్నాహాలు చేస్తునట్లు కోడంబాక్కం టాక్. ఈ చి త్రాన్ని ఇంతకు ముందు కత్తి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన లైకా సంస్థ అధినేతలు నిర్మాణ సారథ్యం చేపట్టనున్నట్లు సమాచారం. ఇందులో రజనీకాంత్‌కు ప్ర తి నాయకుడిగా విక్రమ్ డీకొంటున్నట్లు ప్రచారం జరుగుతోం ది. ఇక ఇందులో నటించే హీరోయిన్ ఎవరన్నది ఇప్పటి వర కూ చాలా సస్పెన్స్ కొనసాగింది. ఇప్పుడు ఆ సొగసైన సుంద రి ఎవరన్నది రివీల్ అయ్యింది. ఆ భామ ఎవరో కాదు మోస్ట్ సెక్సియస్ట్ బాలీవుడ్ నాయకి కత్రినాకైఫ్.
 
  ఈ అమ్మడికి కోలీవుడ్‌లో నటించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఆ విషయాన్ని ధూమ్ 3 చిత్ర విడుదల సమయంలోనే వ్యక్తం చేశారు. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న కత్రినా ఆ మధ్య కొందరు దర్శక నిర్మాతలు ప్రయత్నించినా నో చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు ఎందిరన్-2 కోసం శంకర్ సంప్రదించగా వెంటనే పచ్చజండా ఊపినట్లు తాజా సమాచారం. కాగా ప్రస్తుతం యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్ థాను భారీ ఎత్తున నిర్మిస్తున్న కబాలీ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్న సూపర్‌స్టార్ ఈ చిత్రాన్ని డిసెంబర్ కల్లా పూర్తి చేసి 2016 జనవరిలో ఎందిరన్-2 చిత్రం షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తాజా సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement