చెల్లి చిత్రం అక్కకు తెగనచ్చేసిందట | i like my sister Yan movie says Karthika | Sakshi
Sakshi News home page

చెల్లి చిత్రం అక్కకు తెగనచ్చేసిందట

Oct 14 2014 1:37 AM | Updated on Sep 2 2017 2:47 PM

చెల్లి చిత్రం అక్కకు తెగనచ్చేసిందట

చెల్లి చిత్రం అక్కకు తెగనచ్చేసిందట

చెల్లెలి చిత్రం అక్కకు తెగ నచ్చేసిందట. ఈ సోదరి ద్వయం ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక నాటి అందాల తార రాధ పుత్రికలు కార్తీక, తులసి.

చెల్లెలి చిత్రం అక్కకు తెగ నచ్చేసిందట. ఈ సోదరి ద్వయం ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక నాటి అందాల తార రాధ పుత్రికలు కార్తీక, తులసి. నటి తులసి తొలి చిత్రం కడల్ ఆమెను నిరాశ పరిచింది. అయినా యాన్ అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. జీవా సరసన నటించిన ఈ చిత్రంపై తులసి చాలా ఆశలు పెట్టుకుంది. ప్రముఖ ఛాయాగ్రహకుడు రవి కె చంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్‌ఎస్ ఇన్ఫోటెంట్ పతాకంపై ఎల్‌రెడ్ కుమార్, జయరామన్ నిర్మించారు.
 
 ఈ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. దీనిన తులసి అక్క కార్తీక విడుదల సమయంలో చూడలేదట. ఆమె పొరంబొక్కు చిత్రంతో పాటు తెలుగులో అల్లరినరేష్‌తో నటిస్తున్న చిత్ర షూటింగుల్లో బిజీగా ఉందట. షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి చేసుకుని ముంబయి చేరుకున్న కార్తీక చెల్లి తులసి నటించిన యాన్ చిత్రం చూడాలని తహతహ లాడిందట. ఈ చిత్రం మంబయిలో విడుదల కాలేదు. త్వరలో అనువాదమై రిలీజ్ అవుతుందట. దీంతో కార్తీక చెల్లెలు తులసిని తీసుకుని తన సొంత ఊరైన కేరళ రాష్ట్రం త్రివేండ్రం వెళ్లి యాన్ చిత్రాన్ని తిలకించింది. తన గెస్ట్‌హౌస్‌లో స్టాఫ్‌తో సహా యాన్ చిత్రాన్ని ఏకంగా రెండుసార్లు చూసిందట. చిత్రం ఆమెకు అంతగా నచ్చేసిందట. ఈ విషయం గురించి నటి తులసి చెబుతూ తన చిత్రం చూసిన అక్క తన ను గట్టిగా కౌగిలించుకుని ముద్దాడిందని చెప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement