ప్రేమించి పెళ్లి చేసుకొని.. | Husband killed wife | Sakshi
Sakshi News home page

ప్రేమించి పెళ్లి చేసుకొని..

Sep 28 2016 10:53 AM | Updated on Sep 4 2017 3:24 PM

అనుమానంతో ఓ భర్త భార్యను దారుణంగా హత్యచేశాడు.

 ప్రేమించి పెళ్లి చేసుకొని కడదాక తోడుంటానని మాటిచ్చిన భర్త, భార్యపై అనుమానంతో.. అతి కిరాతకంగా అంతమొందించాడు. ఈ సంఘటన విజయనగరం పట్టణంలో మంగళ వారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన గీత(32)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త గత కొంతకాలంగా ఆమెను వివాహేతర సంబంధం పేరిట హింసిస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న గీత తలపై ఇనుప రాడ్డుతో కొట్టి దారుణంగా హతమార్చాడు. అనంతరం టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement