తాడిపత్రిలో ఉద్రిక్తత | High tension in Tadipatri | Sakshi
Sakshi News home page

తాడిపత్రిలో ఉద్రిక్తత

May 8 2017 2:52 PM | Updated on May 29 2018 4:37 PM

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది.

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన వార్డులో మంచి నీటి సమస్య ఉందని ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ మున్నాపై టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారు. మున్నా ఇంటి వద్ద ధర్నాకు జేసీ వర్గీయులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితి విషమించడంతో పోలీసులు తాడిపత్రిలో 144 సెక్షన్ విధించారు. తాగునీటి సమస్య తీర్చాలని కోరిన వారిపై ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యం చేస్తున్నారని మున్నా మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement