హన్సిక ముచ్చట తీరింది | Hansika about Simbu, Vaalu and Her New Love | Sakshi
Sakshi News home page

హన్సిక ముచ్చట తీరింది

Jul 23 2015 2:21 AM | Updated on Apr 3 2019 9:05 PM

హన్సిక ముచ్చట తీరింది - Sakshi

హన్సిక ముచ్చట తీరింది

అందమైన పరువాల ఈ తరం అమ్మాయి నటి హన్సిక. ఆమెకు ఒక అరుదైన ముచ్చట తీరిందట. కోలీవుడ్‌లో ప్రముఖ

అందమైన పరువాల ఈ తరం అమ్మాయి నటి హన్సిక. ఆమెకు ఒక అరుదైన ముచ్చట తీరిందట. కోలీవుడ్‌లో ప్రముఖ నటీమణుల్లో ఒకరిగా వెలుగొందుతున్న ఈ ఉత్తరాది భామ చేతిలో అరడజను చిత్రాలకు పైగా ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే యాదృశ్చికమైనా కొన్ని విషయాల్లో ఈమెకు నయనతారకు పోలికలున్నాయి. శింబుతో ప్రేమాయణం నడిపి నయనతార దూరమైంది. అదే శింబుతో హన్సిక ప్రేమ పెళ్లి వరకూ దారి తీసి ఆగిపోయింది. ఆ తరువాత కూడా నయనతార శింబుతో ఇదు నమ్మ ఆళు చిత్రంలో జత కట్టారు. ఈ చిత్రం విడుదలలో జాప్యం జరుగుతోంది.
 
  హన్సిక శింబుతో నటించిన వాలు చిత్రం విడుదల్లో సమస్యలనెదుర్కొంటోంది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి చిత్రం పూర్తి కాకుండానే చెల్లాచెదురైంది. చిత్రంలో ఇంకా ఒక్క పాట చిత్రీకరించాల్సింది. కారణాలేమైనా వాలు చిత్ర షూటింగ్‌లో జాప్యం జరిగింది. మిగిలిన పాటను శింబుతో నటించడానికి హన్సిక మొదట్లో నిరాకరించారు. కారణం ఏదయినా ఇప్పటికే వాలు చిత్రం కోసం చాలా కాల్‌షీట్స్ కేటాయించానన్నది ఈమె వాదన. దీంతో ఆ పాటను సీనియర్ నటి సరోజాదేవి, సిమ్రాన్, కుష్భు,శింబులతో చిత్రీకరించాలని చిత్ర వర్గం భావించింది.
 
 అయితే దర్శకుడి రిక్వెస్ట్ మేరకు హన్సిక అంగీకరించడంతో ఇటీవల శింబు, హన్సికలపై చిత్రీకరించారు. ఇలా మాజీ ప్రియులతో మళ్లీ నటించిన చరిత్ర కోలీవుడ్‌లో ఇప్పటికి నయనతార, హన్సికలదే అవతుంది. ఇదిలా ఉంటే వాలు చిత్రంలోని తాజా పాటలో హన్సిక జయలలిత, నగ్మా, సిమ్రాన్‌ల గెటప్‌లలో నటించారట. ఒక్క పాటలోనైనా ఇలా వారిలా నటించడం అరుదైన ముచ్చట అంటున్నారు హన్సిక. ఈ నెల 17న విడుదల కావలసిన వాలు చిత్రం సమస్యల కారణంగా ఆగిపోయింది. అవరోధాలను అధిగమించి త్వరలోనే చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తాం అంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement