అక్క విషం తాగింది...చెల్లి పెళ్లికి సిద్ధమైంది! | groom married brides sister in tamilnadu | Sakshi
Sakshi News home page

అక్క విషం తాగింది...చెల్లి పెళ్లికి సిద్ధమైంది!

Mar 9 2017 10:12 PM | Updated on Sep 18 2018 7:34 PM

అక్క విషం తాగింది...చెల్లి పెళ్లికి సిద్ధమైంది! - Sakshi

అక్క విషం తాగింది...చెల్లి పెళ్లికి సిద్ధమైంది!

ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని అక్క విషం తాగగా అదే ముహూర్తానికి వరుడితో పెళ్లికి చెల్లెలు సిద్ధమయింది.

చెన్నై(కేకే నగర్)‌:
ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని అక్క విషం తాగగా అదే ముహూర్తానికి వరుడితో పెళ్లికి చెల్లెలు సిద్ధమయింది. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఈ ఘటన జరిగింది. తురయూర్‌ సమీపంలో గల బట్టంపట్టికి చెందిన బాలకుమార్‌ (27) వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి సేలం జిల్లా సెందారపట్టికి చెందిన శరణ్య (20)తో వివాహం నిశ్చయమైంది. వీరికి బుధవారం తురయూరులో గల ఆలయంలో వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో మండపంలో విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు.

దీని కోసం మంగళవారం రాత్రి రిసెప్షన్‌ జరిగింది. బుధవారం ఉదయం పెళ్ళి కూతురు మండపానికి తీసుకురావాల్సిన స్థితిలో ఆమె విషం తాగి స్పృహతప్పి పడిపోయింది. దీనిపై ఆరాతీయగా ఆమెకు ఈ పెళ్ళి ఇష్టం లేదని ఇంకా పై చదువులు చదవాలని అనుకుంటున్నట్లు తెలిసింది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. దీనిపై పెళ్ళికొడుకు తరపు వారు తురయూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపారు. రెండు కుటుంబాల వారితో చర్చలు జరిపారు. ఈ మేరకు పెళ్లి కూతురు చెల్లెలు సంగీత (18)ను ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అనంతరం సంగీత సమ్మతంతో బాలకుమార్, సంగీత వివాహం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement