స్నానానికి వెళ్లి నలుగురు విద్యార్థుల గల్లంతు | four students missing in sea at krishna district | Sakshi
Sakshi News home page

స్నానానికి వెళ్లి నలుగురు విద్యార్థుల గల్లంతు

Nov 27 2016 8:30 PM | Updated on Nov 9 2018 4:45 PM

స్నానానికి వెళ్లి నలుగురు విద్యార్థుల గల్లంతు - Sakshi

స్నానానికి వెళ్లి నలుగురు విద్యార్థుల గల్లంతు

కృష్ణాజిల్లాలో సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు.

నాగాయలంక: సముద్రంలో స్నానానికి వెళ్లిన వారిలో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. కృష్ణాజిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండి వద్ద సముద్రంలో స్నానం చేసేందుకు ఆదివారం సాయంత్రం 20మంది విద్యార్థులు వెళ్లారు. అయితే వీరిలో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిని జింకపాలెం గ్రామస్తులుగా గుర్తించారు. గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. నలుగురి విద్యార్థుల వివరాలతో పాటు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement