స్వామివారి బంగారు కిరీటం తాకట్టు ఎపిసోడ్‌లో కొత్త డ్రామా | New Drama In Gold Crown Episode Gudiwada | Sakshi
Sakshi News home page

స్వామివారి బంగారు కిరీటం తాకట్టు ఎపిసోడ్‌లో కొత్త డ్రామా

May 22 2026 6:33 PM | Updated on May 22 2026 7:33 PM

New Drama In Gold Crown Episode Gudiwada

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ వెంకటేశ్వరస్వామి బంగారు కిరీటం మాయం వ్యవహారంలో కొత్త డ్రామాకు తెరలేపింది ఆలయ ట్రస్టు. తాకట్టు పెట్టిన బంగారు కిరీటాన్ని రాత్రికి రాత్రే రాజస్థాన్‌ నుంచి తెప్పించిన ట్రస్టు.. మీడియా ముందు ప్రదర్శించింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి కిరీటాన్ని తాకట్టు పెట్టలేదంటూ ట్రస్టు సభ్యులు కొత్త డ్రామాకు తెరలేపారు. కిరీటం గురించి ప్రశ్నించిన మీడియాపై ట్రస్టు సభ్యులు దౌర్జన్యం చేశారు. అయితే మీడియా ప్రతినిధులకు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు సర్ధిచెప్పి పంపించారు. 

కాగా, కిరీటం తాకట్టు వ్యవహారంలోదాత మాటూరి సుబ్బారావు పోరాటం  ఫలించింది. గుడివాడలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బంగారు కిరీటం మాయం కావడంపై దాత సుబ్బారావు ట్రస్టును ప్రశ్నించారు. చివరకు పోలీసుల జోక్యంతో ఆ కిరీటం తాకట్టు పెట్టినట్లు తేలింది. దీనిపై ఇప్పుడు బుకాయిస్తున్నారు ట్రస్టు సభ్యులు.  తాము కిరీటం తాకట్టుపెట్టలేదంటూ.. హుటాహుటీనా రాజస్థాన్‌ నుంచి తెప్పించి మరీ కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టారు.  

రూ. 75 లక్షలకు పైగా ఉండే ఆ బంగారు కిరీటాన్ని  మాటూరి సుబ్బారావు దంపతులు గతేడాది స్వామి వారికి సమర్పించారు. అయితే స్వామి వారి దర్శనానికి వచ్చిన దాత సుబ్బారావు.. ఆ కిరీటం కనిపించకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. దాంతో ట్రస్టు సభ్యుల్ని సైతం నిలదీశారు. 

తమ పరిధిలో లేకపోయినా  దేవాదాయశాఖ అధికారులు విచారణ చేపట్టారు. సుబ్బారావు  దీనిలో భాగంగా ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ ,ఇతర సభ్యుల పై కేసు నమోదు చేశారు పోలీసులు. దాంతో  ట్రస్టు సభ్యులు కంగారుపడ్డారు.  తాకట్టు వ్యవహారం పై తీవ్ర దుమారం రేగడంతో టీడీపీ నేతలు సైతం రంగంలోకి దిగారు.  తాకట్టు పెట్టుకున్న వ్యాపారి ఆ కిరీటంతో రాజస్థాన్‌కు వెళ్లిపోవడంతో ఆ బంగారు కిరీటాన్నిఅక్కడ నుంచి పరుగ పరుగు పరుగున తెప్పించి మీడియా ముందు ప్రదర్శించారు. ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలపై చిందులు వేశారు ట్రస్టు సభ్యులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement