కృష్ణా జిల్లా విజయవాడ సత్యనారాయణపురంలోని రవీంద్ర భారతీ స్కూల్ లో అగ్ని ప్రమాదం సంభవించింది.
రవీంద్రభారతి స్కూల్లో అగ్ని ప్రమాదం
Feb 6 2017 4:40 PM | Updated on Sep 5 2018 9:47 PM
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడ సత్యనారాయణపురంలోని రవీంద్ర భారతీ స్కూల్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. స్కూల్లోని నాలుగో అంతస్తులో ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. దీనితో స్టోర్ రూంలో వుంచిన పుస్తకాలు, ఫర్నీచర్ దగ్ధమయ్యాయి. మంటలను గమనించిన టీచర్లు, విద్యార్థులు కిందికి పరుగులు తీశారు. రెండు ఫైర్ ఇంజన్లు సకాలంలో సంఘటనా స్ధలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు వాడాల్సిన కనీస పరికరాలు కూడా పాఠశాలలో లేవని అధికారులు గుర్తించారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై విచారణ జరుపుతున్నారు.
Advertisement


