గోదావరిఖనిలో భారీ అగ‍్నిప్రమాదం | fire accident in godavari klhani | Sakshi
Sakshi News home page

గోదావరిఖనిలో భారీ అగ‍్నిప్రమాదం

Nov 8 2016 2:10 PM | Updated on Sep 5 2018 9:47 PM

కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనిలో ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

గోదావరిఖని: కరీంనగర్‌జిల్లా గోదావరిఖనిలో ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దారా దాసు అనే రిటైర్డు ఆర్టీసీ డ్రైవర్ కుటుంబసభ్యలుతో కలిసి చర్చికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల యువకులు గమనించి వెంటనే మంటలు ఆర్పివేశారు. అగ్నిమాపక సిబ్బందికి  కూడా వచ్చి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఇంట్లో వంటకు ఉపయోగించే చిన్న సిలిండర్ ఒకటి పేలి పక్క ఇళ్లపై పడింది. దీంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మరో సిలిండర్ కూడా కాలిపోయింది. ఇంట్లో ఇంకా రెండు సిలిండర్లు కూడా ఉన్నాయని, అవి పేలి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. వన్ టౌన్ ఎస్సై సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement