కోర్టు తీర్పునూ పట్టించుకోరా | field assistants dharna at srikakulam district | Sakshi
Sakshi News home page

కోర్టు తీర్పునూ పట్టించుకోరా

Mar 27 2017 1:34 PM | Updated on Oct 2 2018 6:35 PM

తొలగించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని కోర్టు తీర్పు ఇచ్చినా అధికారులు వారిని విధుల్లోకి తీసుకోవడంలేదు.

శ్రీకాకుళం: తొలగించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని కోర్టు తీర్పు ఇచ్చినా అధికారులు వారిని విధుల్లోకి తీసుకోవడంలేదు. మందస మండలంలో 12 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను రాజకీయ కోణంలో ప్రభుత్వం తొలగించింది. వారిని విధుల్లోకి తీసుకోవాలని ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే కోర్టు తీర్పును ధిక్కరించిన మండల అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడంలేదని ఫీల్డ్ అసిస్టెంట్లు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. వీరి ధర్నాకు వైఎస్సార్‌సీపీ నేతలు సంఘీభావం తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement