పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం చెలికానివానిపోతేపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.
ఉరివేసుకుని రైతు ఆత్మహత్య
Oct 19 2016 11:58 AM | Updated on Oct 1 2018 2:36 PM
ద్వారకాతిరుమల: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం చెలికానివానిపోతేపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆకుల సత్యనారాయణ(34) అనే రైతు గ్రామంలో పామాయిల్ తోటలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఉరేసుకున్న తీరు చూస్తే ఆత్మహత్య కాస్త అనుమానంగా ఉంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Advertisement


