చావుబతుకుల్లో ఉంటే రోడ్డున పడేశారు! | Housekeeping supervisor found dead under suspicious circumstances at Metromall | Sakshi
Sakshi News home page

చావుబతుకుల్లో ఉంటే రోడ్డున పడేశారు!

Apr 17 2026 4:15 AM | Updated on Apr 17 2026 4:15 AM

Housekeeping supervisor found dead under suspicious circumstances at Metromall

మెట్రోమాల్‌లో హౌస్‌కీపింగ్‌ సూపర్‌వైజర్‌ అనుమానాస్పద మృతి

యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని మృతుడి భార్య ఆరోపణ

మృతదేహాన్ని మాల్‌లో ఉంచి కుటుంబ సభ్యుల ఆందోళన

పంజగుట్ట (హైదరాబాద్‌): హైదరాబాద్‌ పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మెట్రోమాల్‌లో ఓ వ్యక్తి అనుమా నాస్పద స్థితిలో మృతిచెందడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎర్రమంజిల్‌ మెట్రోమాల్‌ లోని థియేటర్‌లో హౌస్‌కీపింగ్‌ సూపర్‌వైజర్‌గా పనిచే స్తున్న పురానాపూల్‌వాసి సత్యనారాయణ (45) బుధ వారం రాత్రి నైట్‌డ్యూటీ చేస్తూ గురువారం తెల్లవారు జామున 3:40 ప్రాంతంలో వాంతులు చేసుకొని కింద పడిపోయాడు.

గమనించిన తోటి సిబ్బంది సత్యనారాయణ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి అతన్ని ఉస్మానియాకు తరలించారు. అప్పటికే సత్యనారాయణ మృతిచెందినట్లు వైద్యులు చెప్పడంతో తిరిగి మెట్రోమాల్‌ లోపలకు మృతదేహాన్ని తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. తన భర్త కిందపడిపోగానే నిమ్స్‌కు తరలించకుండా సిబ్బంది రోడ్డుపై పడుకోబెట్టారని.. థియేటర్‌ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తన భర్త మరణించాడని మృతురాలి భార్య ఆరోపించారు. 

మరోవైపు మృతుడి కుటుంబ సభ్యులకు మద్దతుగా సీఐటీయూ నాయకులు భారీగా తరలివచ్చి మెట్రోమాల్‌ థియేటర్‌ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సత్యనారాయణ కుటుంబ సభ్యులు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. చివరకు పోలీసు ఉన్నతాధికారులు అక్కడకు చేరుకొని బాధిత కుటుంబాన్ని సముదాయించి గురువారం సాయంత్రం మృతదేహాన్ని గాంధీకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement