ఇందిరాగాంధీ విమానాశ్రయం (ఐజీఐ)లో దిగే ఆరోగ్య పరీక్షలు జరిగేవిధంగా చూడాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ... లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కోరారు.
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ విమానాశ్రయం (ఐజీఐ)లో దిగే ఆరోగ్య పరీక్షలు జరిగేవిధంగా చూడాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ... లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కోరారు. ఆఫ్రికాలో ఈ వ్యాధి విజృంభించిన నేపథ్యంలో తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరృకు ఆయన ఎల్జీకి ఓ లేఖ రాశారు. వర్షాకాలం అయినందువల్ల నగరవాసులకు అంటువ్యాధులు సోకకుండా తగు చర్యలు తీసుకోవాలంటూ ఆయా కార్పొరేషన్లను ఆదేశించాలని కూడా సదరు లేఖలో కోరారు. అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ చేయాలన్నారు. లేకపోతే నగరవాసులు అంటువ్యాధులబారినపడే ప్రమాదం పొంచి ఉందన్నారు.
ఇదిలాఉంచితే ఎబోలా వ్యాధిబారినపడి నగరానికి వచ్చిన ముగ్గురు నైజీరియన్లకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ రూం (ఎన్సీడీసీ)లో పరీక్షలు చేశారు. అనంతరం రాంమనోహర్ లోహియా (ఆర్‌ఎంఎల్) ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఎన్సీడీసీ పేర్కొంది. ఇదిలాఉండగా నైజీరియా వెళ్లి తిరిగి వచ్చిన 32 ఏళ్ల చత్తీస్‌గఢ్ వాసికి కూడా పరీక్షలు చేశామని సదరు ప్రకనటలో ఎన్సీడీసీ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,127 మంది ఈ వ్యాధిబారినపడగా అందులో 1,145 మంది చ నిపోయారు.