‘ఆమె ఫొటోలు కూడా తీసేస్తే అప్పుడు చర్చలు’ | Dump VK Sasikala Photos In AIADMK Office, Says OPS Camp | Sakshi
Sakshi News home page

‘ఆమె ఫొటోలు కూడా తీసేస్తే అప్పుడు చర్చలు’

Apr 25 2017 12:59 PM | Updated on Sep 29 2018 5:47 PM

‘ఆమె ఫొటోలు కూడా తీసేస్తే అప్పుడు చర్చలు’ - Sakshi

‘ఆమె ఫొటోలు కూడా తీసేస్తే అప్పుడు చర్చలు’

విలీనం చేసే చర్చలకు ముందు పన్నీర్‌ సెల్వం వర్గం రోజుకో కొత్త డిమాండ్‌ను తెరమీదకు తెస్తోంది.

చెన్నై: విలీనం చేసే చర్చలకు ముందు పన్నీర్‌ సెల్వం వర్గం రోజుకో కొత్త డిమాండ్‌ను తెరమీదకు తెస్తోంది. ఇప్పటి వరకు మొత్తం శశికళ కుటుంబాన్ని పార్టీకి దూరంగా పెట్టాల్సిందేనని డిమాండ్‌ చేసిన ఆయన వర్గం తాజాగా శశికళ ఫొటోలు కూడా ఉండటానికి వీల్లేదని శాసించింది. ముందు ఆ పని చేస్తేనే చర్చలకు ముందడుగేస్తామంటూ పన్నీర్‌సెల్వం వర్గంలోని కీలక నేత ఈ మధుసూదనన్‌ డిమాండ్‌ చేశారు.

‘శశికళ ఛాయా చిత్రాలన్నింటిని బయటపడేయండి. పార్టీ కార్యాలయ పవిత్రతను కాపాడండి’ అంటూ ఆయన పిలుపునిచ్చారు. చెన్నైలోని రాయపీఠ్‌లో త్వరలో పన్నీర్‌ వర్గం, పళనీస్వామి వర్గం ఏకమయ్యే అంశానికి సంబంధించి చర్చలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికీ పార్టీకి సంబంధించిన ప్రధాని కార్యాలయంతోపాటు ఇతర చిన్న చిన్న కార్యాలయాల్లో కూడా శశికళ ఫొటోలు డామినేట్‌ చేస్తున్నాయంట. ఈ నేపథ్యంలో వాటన్నింటిని తీసిపారేయండి అంటూ తాజాగా డిమాండ్‌ తెరపైకి తెచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement