కనకదుర్గ దేవస్థానంలో ముగిసిన దసరా ఉత్సవాలు | dasara celebrations end in vijayawada durga temple | Sakshi
Sakshi News home page

కనకదుర్గ దేవస్థానంలో ముగిసిన దసరా ఉత్సవాలు

Oct 11 2016 12:20 PM | Updated on Jul 29 2019 6:03 PM

బెజవాడ కనకదుర్గ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు మంగళవారం ముగిశాయి.

విజయవాడ : బెజవాడ కనకదుర్గ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు మంగళవారం ముగిశాయి. ఆలయ పండితులు యజ్ఞ నారాయణశర్మ, శివప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎ. సూర్యకుమారితోపాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 11 రోజులపాటు అత్యంత వైభవంగా దసరా మహోత్సవాలు జరిగాయి. సాయంత్రం గంగా సమేత దుర్గా మల్లేశ్వరస్వామివార్ల తెప్పోత్సవం హంసవాహనంపై కృష్ణానదిలో జరగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement