అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య | cotton farmer commits suicide in jayasankar district | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య

Oct 22 2016 3:37 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల బాధ తాళలేక ఓ పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

జయశంకర్‌జిల్లా: అప్పుల బాధ తాళలేక ఓ పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని గిద్దెముత్తారం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పంచిక శంకర్(30) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పంట దిగుబడి సరిగ్గా రాకపోవడం.. చేసిన అప్పులు తీర్చే దారికానరాక తన పత్తి చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement