జన చైతన్య యాత్రలో బాబు ముఖాముఖి | cm chandrababu speaks over assembly segments increasing in ap at srikakulam jana chaitanya yatra | Sakshi
Sakshi News home page

జన చైతన్య యాత్రలో బాబు ముఖాముఖి

Nov 12 2016 5:31 PM | Updated on Aug 14 2018 11:26 AM

జన చైతన్య యాత్రలో బాబు ముఖాముఖి - Sakshi

జన చైతన్య యాత్రలో బాబు ముఖాముఖి

జన చైతన్య యాత్రలో భాగంగా చంద్రబాబు కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించారు.

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు శనివారం జన చైతన్య యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ గ్రౌండ్స్లో టీడీపీ కార్యకర్తలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. కార్యకర్తలు తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.

పెన్షన్లు, నీరు-చెట్టు, ఇంకుడు గుంతలు, మరుగు దొడ్ల నిర్మాణ బిల్లులు అందడం లేదని చెప్పారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 225 కు పెరుగుతాయని చంద్రబాబు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement