రాష్ట్రంలో తాగు, సాగునీటి సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ సవతి తల్లి ప్రేమ
సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు: రాష్ట్రంలో తాగు, సాగునీటి సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు. నగరంలో మారుతి ఐ క్లినిక్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా తనను కలిసిన మీడియా ప్ర తినిధులతో మాట్లాడుతూ... మహదాయి న దీ నీటి పంపకం, మలప్రభ-మహదాయి నదు ల అనుసంధానం, కళసబండూరి సాగునీటి పథ కం ప్రారంభం తదితర విషయాల పరిష్కారాని కి చొరవ చూపాలంటూ ఇటీవల ప్రధాని నరేం ద్రమోదీని కర్ణాటక అఖిల పక్షం సభ్యులు కలిసి విన్న వించుకున్నా ప్రయోజనం లేకపోయిందన్నారు. ‘మహదాయి నీటి పంపకం విషయం లో కర్ణాటక, గోవా, మహరాష్ట్ర మధ్య తరు చూ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆ రెండు రాష్ట్రా ల్లో బీజేపీ అధికారంలో ఉంది.
అందువల్ల కర్ణాటకతో పాటు ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలసి ఈ విషయం పై చర్చించాల్సిందిగా ప్రధాని నరేంద్రమోదీని కోరినా అందుకు ఆయన సమ్మతించలేదు. మూడు రాష్ట్రాల ప్రతిపక్షనాయకులతో మొదట చర్చించండి అని మాకు సూచించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఆయన అలా మాట్లాడారు. ఇది సరికాదు. మొదట ప్రధాని మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిపితే అటు పై మేము మూడు రాష్ట్రాల ప్రతిపక్షనాయకులతో సమావేశమవుతాం.’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాభవానికి గల కారణాలతో కూడిన నివేదిక ఇవ్వాల్సిందిగా పార్టీ హై కమాండ్ నుంచి తనకు ఎలాంటి సూచన అందలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.