క్యాట్‌ఫిష్ కేంద్రాలు ధ్వంసం | cat fish centres damaged | Sakshi
Sakshi News home page

క్యాట్‌ఫిష్ కేంద్రాలు ధ్వంసం

Jan 1 2014 2:11 AM | Updated on Sep 2 2018 5:45 PM

తాలూకాలో అక్రమంగా నిర్వహిస్తున్న నిషిద్ధ క్యాట్‌ఫిష్ కేంద్రాలను అధికారులు ధ్వంసం చేశారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నసంద్ర గ్రామంలో జరిగిన సంఘటన వివరాలు... చిన్నసంద్ర గ్రామంలో నిషేధిత క్యాట్‌ఫిష్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించిన జిల్లా అధికారి వాటిని తొలగించాలని ఆదేశించారు.

 చింతామణి, న్యూస్‌లైన్ :
 తాలూకాలో అక్రమంగా నిర్వహిస్తున్న నిషిద్ధ క్యాట్‌ఫిష్ కేంద్రాలను అధికారులు ధ్వంసం చేశారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నసంద్ర గ్రామంలో జరిగిన సంఘటన వివరాలు... చిన్నసంద్ర గ్రామంలో నిషేధిత క్యాట్‌ఫిష్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించిన జిల్లా అధికారి వాటిని తొలగించాలని ఆదేశించారు. వారికి ఇచ్చిన మూడు నెలల గడువు కూడా ముగి సింది. గతంలో క్యాట్‌ఫిష్ కేంద్రాలను తొలగించడానికి వెళ్లిన అధికారులపై నిర్వాహకులు దాడి చేసిన విషయం తెల్సిందే. దీంతో ముందుజాగ్రత్త చర్యగా 144 సెక్షన్ జారీ చేసిన తహసిల్దార్ కృష్ణస్వామి మంగళవారం ఉదయం జిల్లా న ుంచి ప్రత్యేక పోలీసు బలగాలను రప్పించి దాదాపు 50 క్యాట్‌ఫిష్ కేంద్రాలను ధ్వంసం చేశారు.
 
  క్యాట్‌ఫిష్ పెంపకం సుప్రీం కోర్టులో పెండింగ్ ఉన్నందున వాటిని పెంచడానికి అవకాశం కల్పించాలని బెంగళూరుకు చెందిన న్యాయవాది ఆనంద్ తహసిల్దార్‌కు విజ్ఞప్తి చేశారు. వీటిని ఖాతరు చేయని తహసిల్దార్, డీఎస్‌పీలు దగ్గరుండి క్యాట్‌ఫిష్ కేంద్రాలను ధ్వంసం చేయించారు. ఈ మేరకు చిన్నసంద్ర, చెందనహళ్లి చుట్టు పక్కల వ ుూడు కిలోమీటర్ల మేర కు మంగళవారం సాయంత్రం వరకు 144 సెక్షన్  విధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement