పెళ్లి పీటల నుంచి పరీక్షకు.. | Bride Writen Exams After Marriage In Karnataka | Sakshi
Sakshi News home page

పెళ్లి పీటల నుంచి పరీక్షకు..

Nov 19 2018 12:39 PM | Updated on Nov 19 2018 12:39 PM

Bride Writen Exams After Marriage In Karnataka - Sakshi

పరీక్ష రాస్తున్న నవవధువు శ్వేత

సాక్షి బెంగళూరు: కాలం చాలా విలువైనది అని నిరూపించింది ఓ నవవధువు. పెళ్లయిన కొన్ని క్షణాల్లోనే పరీక్ష రాసేందుకు సిద్ధమైంది. ఈ సంఘటన ఆదివారం హాసన్‌లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. డిగ్రీ బీకాం ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న శ్వేతకు ఆదివారం ఉదయం 7.45 నుంచి 8.45 లోపు ఖరారు చేసిన ముహూర్తంలో వివాహమైంది. కాగా పెళ్లి పీటల నుంచి నేరుగా పరీక్ష హాలుకు వెళ్లింది. గత మే నెలలో నిశ్చితార్థం అయింది. ఇంట్లో వారు ఈనెల 18వ తేదీ పెళ్లి తేదీ ఖరారు చేశారు. అయితే పరీక్షకు గైర్హాజరయితే ఏడాది వృథా అవుతుందని భావించి పరీక్షకు హాజరయినట్లు శ్వేత తెలిపింది.  హాసన్‌లోని మహిళా కళాశాలలో పరీక్ష నిర్వహించారు.

1
1/1

పరీక్ష రాస్తున్న నవవధువు శ్వేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement