'అమరావతిలో శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయి' | Bhumana Karunkar reddy slams Chandrababu naidu | Sakshi
Sakshi News home page

'అమరావతిలో శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయి'

Oct 10 2016 1:22 PM | Updated on Aug 18 2018 5:48 PM

'అమరావతిలో శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయి' - Sakshi

'అమరావతిలో శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయి'

అమరావతిలో వేసిన శిలాఫలకాలు ఇప్పుడు వెక్కిరిస్తున్నాయని భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు.

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం కోసం అమరావతిలో వేసిన శిలాఫలకాలు ఇప్పుడు వెక్కిరిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. ఏడాదవుతున్న రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పేర్చలేదని మండిపడ్డారు. సోమవారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. శంకుస్థాపన కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. 100 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.

లాండ్‌ పూలింగ్‌ పేరుతో రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే దసరా నాటికి రాజధాని నిర్మాణాలు ఒక రూపుకొస్తాయని.. చంద్రబాబు ప్రజలను మరోసారి మభ్యపెడుతున్నారని భూమన విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement