నకిలీనోట్ కంటే నకిలీవిత్తనాలు ప్రమాదకరమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి భట్టివిక్రమార్క అన్నారు.
నకిలీ నోట్ కంటే నకిలీ విత్తనాలు సమాజానికి ప్రమాదకరమని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఖమ్మంలో విలేకరుల తో మాట్లాడారు. నకిలీ విత్తనాలు అమ్మేందుకు అనుమతి ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు ఆర్ధికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆనందంగా ఉన్నారని సీఎం ఎలా చెబుతారని అన్నారు. నకిలీ విత్తనాల వ్యవహారంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బెదిరించే విధంగా సీఎం కేసీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ నకిలీ సీడ్‌కు కేంద్రంగా మారుతోందని, ఈ విషయంలో సీఎం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.