5.9 లక్షల విలువైన బంగారం పట్టివేత | 5.9 Lakh worth gold seized at Tiruchi airport | Sakshi
Sakshi News home page

5.9 లక్షల విలువైన బంగారం పట్టివేత

Aug 10 2014 9:38 AM | Updated on Aug 25 2018 5:33 PM

సింగపూర్ నుంచి తిరుచ్చికి విమానంలో బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని విమానాశ్రయ అధికారులు అరెస్టు చేశారు.

తిరువొత్తియూరు: సింగపూర్ నుంచి తిరుచ్చికి విమానంలో బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని విమానాశ్రయ అధికారులు అరెస్టు చేశారు. సింగపూర్ నుంచి తిరుచ్చికి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం తిరుచ్చికి వచ్చింది. ఈ విమానం నుంచి దిగిన ప్రయాణికుల వద్ద కస్టమ్స్  అధికారులు తనిఖీ చేశారు.

తనిఖీ ల్లో ఇద్దరు ప్రయాణికుల వద్ద 250 గ్రాము ల బరువు కలిగిన ఆరు బంగారు బిస్కెట్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ బంగారం విలువ రూ. 5.9 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. విచారణలో బంగారం తరలించిన వ్యక్తులు మదురై జిల్లా మేలూరు కొట్టాం పట్టికి చెందిన సెంథిల్, రత్నం అని తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement