వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టిన ఘటనలో 35 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
బస్సు ప్రమాదం: 35 మందికి గాయాలు
Jan 26 2017 12:00 PM | Updated on Nov 6 2018 4:04 PM
ఎల్లారెడ్డిపేట: వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టిన ఘటనలో 35 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం వద్ద గురువారం చోటు చేసుకుంది. సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెంకటాపురం శివారులో చెట్టును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement


