దుక్కి దున్నుతున్న ట్రాక్టర్‌పై విద్యుత్ స్తంభం విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
విద్యుత్ స్తంభం విరిగిపడి ఇద్దరు మృతి
Sep 8 2016 10:36 AM | Updated on Apr 3 2019 7:53 PM
దమ్మపేట: దుక్కి దున్నుతున్న ట్రాక్టర్‌పై విద్యుత్ స్తంభం విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లిలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లకావత్ చిట్టయ్య(35), ధారావత్ మహేష్(22)లు ట్రాక్టర్ సాయంతో దుక్కిదున్నతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం విరిగిపడింది. దీంతో ట్రాక్టర్ పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


