వైద్యుల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మృతిచెందాడని అతని కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
వైద్యుల నిర్లక్ష్యం: ఒకరి మృతి
Mar 4 2017 11:26 AM | Updated on May 28 2018 4:20 PM
- కుటుంబసభ్యుల ఆందోళన
అనకాపల్లి: వైద్యుల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మృతిచెందాడని అతని కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో శనివారం చోటుచేసుకుంది. సింహాచలం(58) అనే వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతూ ఉషాప్రైమ్ ఆస్పత్రిలో చేరాడు. ఇక్కడి వైద్యులు సరైన వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన బందువులు ఆస్పత్రి ఎదటు ఆందోళనకు దిగారు.
Advertisement


