‘ఆ బుకీ కోసం విచారణ సాగిస్తున్నాం’ | we investigate alligations of match fixing, says srilanka | Sakshi
Sakshi News home page

‘ఆ బుకీ కోసం విచారణ సాగిస్తున్నాం’

Dec 19 2015 2:57 PM | Updated on Nov 9 2018 6:43 PM

‘ఆ బుకీ కోసం విచారణ సాగిస్తున్నాం’ - Sakshi

‘ఆ బుకీ కోసం విచారణ సాగిస్తున్నాం’

ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టెస్టును ఫిక్స్ చేయాల్సిందిగా తమ ఆటగాళ్లను సంప్రదించిన బుకీ కోసం విచారణ చేస్తున్నట్లు శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది.

కొలంబో: ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టెస్టును ఫిక్స్ చేయాల్సిందిగా తమ ఆటగాళ్లను సంప్రదించిన బుకీ కోసం విచారణ చేస్తున్నట్లు శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. అక్టోబర్‌లో జరిగిన గాలె టెస్టులో వికెట్ కీపర్ కుశాల్ పెరీరా, బౌలర్ హెరాత్‌లకు 70 వేల డాలర్లను ఇచ్చేందుకు ఓ బుక్ మేకర్ ఆశ చూపి, విండీస్ విజయం సాధించేలా చూడాలని కోరినట్టు క్రీడా మంత్రి దయసిరి జయశేఖర పేర్కొన్నారు.

 

కచ్చితంగా శ్రీలంక గెలిచే ఆ మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే ఆలౌట్ కావాలని వారు కోరుకున్నారని, ఇదే జరిగి విండీస్ నెగ్గితే వారికి భారీ స్థాయిలో డబ్బు చేకూరేదని మంత్రి చెప్పారు. అయితే ఈ విషయాన్ని వారిద్దరు అవినీతి వ్యతిరేక అధికారులకు చేరవేశారని అన్నారు. ఆ మ్యాచ్‌లో లంక ఇన్నింగ్స్ ఆరు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement