‘ధోనికి చాన్స్‌ ఇవ్వడం బాధించింది’

That Was Dagger To My Heart, Dinesh Karthik - Sakshi

గుండెల్లో కత్తి దింపినట్లు అ‍య్యింది..

చెన్నై:  ఎంఎస్‌ ధోని..  అటు భారత జట్టుకే కాదు..  ఇటు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో కూడా ఒక సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌. భారత్‌కు టీ20 వరల్డ్‌కప్‌, వన్డే వరల్డ్‌కప్‌, చాంపియన్స్‌ ట్రోఫీలు సాధించిన ధోని.. ఐపీఎల్‌లో సీఎస్‌కే మూడు టైటిల్స్‌ను సాధించి పెట్టాడు. ప్రధానంగా ధోని-దినేశ్‌ కార్తీక్‌లు సమకాలీన క్రికెటర్లే. భారత్‌ జట్టులో స్థానం కోసం వీరిద్దరి మధ్యే పోటీ ప్రధానంగా ఉండేదనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పోటీలో ధోని స్థానాల్ని దక్కించుకోవడమే కాకుండా రెగ్యులర్‌ ఆటగాడు అయిపోయాడు. ఇలా రెగ్యులర్‌ క్రికెటర్‌గా భారత​ జట్టులో స్థానం సంపాదించిన కొద్దిపాటి వ్యవధిలోనే కెప్టెన్‌గా కూడా ఎదిగిపోయాడు. (‘గేర్’ మార్చి దంచి కొట్టిన వేళ..!)

మరి సీఎస్‌కే కీపర్‌, కెప్టెన్‌ అయిన ధోని విషయంలో మరో​ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ బాధ పడిన సందర్భం కూడా ఉందట.  సొంత రాష్ట్రానికి చెందిన దినేశ్‌ కార్తీక్‌ను కాదని చెన్నై సూపర్ కింగ్స్ .. జార్ఖండ్ డైనమైట్ ఎంఎస్‌ ధోనిని తీసుకుంది. అలా తనను కాదని ధోనీని సీఎస్‌కే తీసుకున్నప్పుడు చాలా బాధించిందని కార్తీక్‌ తెలిపాడు. ఆ సమయంలో తన గుండెల్లో కత్తి దింపినట్లు అయ్యిందన్నాడు.  13 ఏళ్లుగా తన సొంత రాష్ట్ర జట్టు అయిన సీఎస్‌కేలో ఆడాలని చూస్తున్నట్లు కార్తీక్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా ఉన్న దినేశ్‌ కార్తీక్‌.. సీఎస్‌కే ఆడాలనేది ఒక కోరిక అన్నాడు. (ఇంకా నాపై నిషేధం ఎందుకు?)

దేశవాళీ మ్యాచ్‌ల్లో తమిళనాడుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కార్తీక్‌కు ఐపీఎల్‌లో ఆ జట్టు తరఫున ఆడే అవకాశం రాకపోవడం నిజంగా దురదృష్టమేనన్నాడు. ‘2008 ఐపీఎల్ సీజన్ వేలం సమయంలో నేను ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాను. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ తమిళనాడుకి చెందినది కావడంతో.. ఆ రాష్ట్రానికి చెందిన నేను అప్పటికే టీమిండియాలో ఆడుతుండటంతో నన్ను ఫస్ట్ కొనుగోలు చేస్తారని ధీమాగా ఉండిపోయాను. అయితే.. కెప్టెన్సీ ఇస్తారా లేదా అని మాత్రమే సందేహం ఉండేది. కానీ అనూహ్యంగా ధోనిని కొనుగోలు చేశారు. ఆ టైమ్‌‌లో ధోని నా పక్కనే కూర్చుని ఉన్నాడు. దీని గురించి అతను ఓ మాట కూడా చెప్పలేదు. బహుశా ధోనీ కూడా ఆ ఎంపికను ఊహించలేదనుకుంటా. నన్ను కాదని ధోనిని ఎంపిక చేయడం చాలా బాదేసింది’ అని దినేశ్‌ చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకూ ఆరు ఫ్రాంచైజీలు మారిన కార్తీక్‌.. సీఎస్‌కేకు ఎప్పుడు ఆడతాడో చూడాలి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top