‘గేర్’ మార్చి దంచి కొట్టిన వేళ..!

On This Day In 2013 Gayle Slams Fastest Hundred In Cricket History - Sakshi

బెంగళూరు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-13వ సీజన్‌ ఆరంభం అయ్యుంటే ఇప్పటికీ దాదాపు నెల ఆటను ఆస్వాదించే వాళ్లం. కరోనా వైరస్‌ కారణంగా ఐపీఎల్‌ తాజా సీజన్‌ వాయిదా పడగా, అసలు జరుగుతుందా.. లేదా అనే అనుమానం కూడా మరోవైపు వ్యక్తమవుతోంది. కరోనా వైరస్‌ ప్రభావం నేటికీ ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో క్యాష్‌ రిచ్‌ లీగ్‌ అయిన ఐపీఎల్‌పై తీవ్రమైన  ప్రభావం చూపుతోంది.  ఇదిలా ఉంచితే, ఐపీఎల్‌ తాజా సీజన్‌కు మనం దూరంగా ఉన్నప్పటికీ గతంలో వెస్టిండీస్‌ స్టార్‌ క్రికెటర్‌, అప్పటి ఆర్సీబీ ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ లిఖించిన రికార్డును ఒకసారి చూద్దాం. (తుఫాన్ ఇన్నింగ్స్ అంటే ఏంటో చూపించాడు‌)

సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు(2013, ఏప్రిల్‌ 23)న తేదీన రాయల్స్‌ చాలెంజర్స్‌  బెంగళూరు ఆటగాడు క్రిస్‌ గేల్‌.. పుణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. 30 బంతుల్లో సెంచరీ బాదేశాడు. సెంచరీ సాధించే క్రమంలో ఏడు డాట్‌ బాల్స్‌ మాత్రమే ఉండగా.. 11 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గేర్‌ మార్చి కొట్టిన గేల్‌ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 263 రికార్డు పరుగుల స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా గేల్‌ 66  బంతుల్లో 17 సిక్స్‌లు, 13 ఫోర్లతో 175 పరుగులు చేశాడు.  ఇక గేల్‌ 30 బంతుల్లో సెంచరీతో ఆండ్రూ సైమండ్స్‌ రికార్డును బద్ధలు కొట్టాడు. సైమండ్స్‌ 34 బంతుల్లో సెంచరీ చేయగా, దాన్ని గేల్‌ బ్రేక్‌ చేశాడు. క్రికెట్‌ చరిత్రలో ఇదే వేగవంతమైన సెంచరీగా నిలిచింది. ఇ‍క గేల్‌ సాధించిన 175 పరుగులు కూడా ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటికీ అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. గతంలో ఆర్సీబీకి ఆడిన గేల్‌.. ఆపై కింగ్స్‌ పంజాబ్‌కు షిష్ట్‌ అయ్యాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top