ఇంకా నాపై నిషేధం ఎందుకు?

Salim Malik Pleads PCB, ICC To Drop His Lifetime Ban - Sakshi

ఐసీసీకి పాక్‌ మాజీ క్రికెటర్‌ సలీమ్‌ మాలిక్‌ వినతి

కోచ్‌గా చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి

కరాచీ: తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని తొలగించాలని పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సలీమ్‌ మాలిక్‌ విన్నవించాడు. ఈ మేరకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ)కి, అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)కి ఓ వీడియో సందేశాన్ని పంపాడు. తనపై కొనసాగుతున్న నిషేధాన్ని తొలగించి, తాను కోచ్‌గా చేసుకోవడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశాడు. (‘గేర్’ మార్చి దంచి కొట్టిన వేళ..!)

ప్రస్తుతం తనకు దేశానికి, ఆటగాళ్లకు కోచ్‌గా చేయాలని ఉందని వీడియో మెస్సేజ్‌లో పేర్కొన్నాడు. కాగా, 1995లో ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు.. పాకిస్తాన్‌లో పర్యటించినప్పుడు సలీమ్‌ మాలిక్‌.. అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆస్ట్రేలియా ఆటగాళ్లు షేన్‌ వార్న్‌, మార్క్‌ వా, టిమ్‌ మేలు మాలిక్‌ భారీగా ముడుపులు అందుకున్నాడని ఆరోపణలు వ్యాపించాయి. దీనిపై పీసీబీ సుదీర్ఘ విచారణ తర్వాత మాలిక్‌పై జీవిత కాల నిషేధం విధించారు. 2000లో మాలిక్‌ తప్పుచేసినట్లు తేలడంతో అతనిపై నిషేధం పడింది. కాగా, 2008లో మాలిక్‌పై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ పాకిస్తాన్‌ కోర్టు తీర్పునిచ్చింది. (హర్మన్ మ్యాజిక్‌ ట్రిక్‌కు ఫ్యాన్స్‌ బౌల్డ్‌..!)

కాగా, మాలిక్‌పై నిషేధం విషయంలో పీసీబీ తగ్గకపోవడంతో అతను క్రికెట్‌ సంబంధిత వ్యవహారాల్లో పాలుపంచుకోవడానికి దూరం కావాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం తాను కోచ్‌గా చేయాలనుకుంటున్నానని, దాంతో తనపై ఉన్న నిషేధాన్ని తొలగించాలంటూ పీసీబీ, ఐసీసీలను కోరాడు. 1982-99 మధ్య కాలంలో పాకిస్తాన్‌ తరఫున  103 టెస్టులు, 283 వన్డేలను మాలిక్‌ ఆడాడు. 2008లో నేషనల్‌ అకాడమీలు కోచ్‌గా చేయడానికి మాలిక్‌ దరఖాస్తు చేసుకోగా, 2012లో పాకిస్తాన్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా చేయడానికి అప్లై చేసుకున్నాడు. ఈ రెండు సందర్భాల్లోనూ మాలిక్‌ దరఖాస్తులను కనీసం పట్టించుకోలేకపోవడం గమనార్హం. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top