హర్మన్ మ్యాజిక్‌ ట్రిక్‌కు ఫ్యాన్స్‌ బౌల్డ్‌..!

Harmanpreet's Magic Trick Leaves Fans Stumped - Sakshi

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా స్వీయ నిర్భందంలో ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌ ఇటీవల  తనకు తెలిసిన ట్రిక్స్‌తో అభిమానుల్ని అలరించిన సంగతి తెలిసిందే. హౌస్‌ మాజీషియన్‌గా మారిపోయి కార్డ్‌ ట్రిక్‌ షోను ప్రదర్శించి బీసీసీఐని సైతం అబ్బుర పరిచాడు. ఇలా కార్డ్‌ ట్రిక్‌ ద్వారా నవ్వులు తెప్పించిన అయ్యర్‌ వీడియోకు థాంక్యూ చాంపియన్‌ అం​టూ  బీసీసీఐ క్యాప్షన్‌ ఇచ్చింది. మరి ఇప్పుడు భారత మహిళా క్రికెట్‌ జట్టు టీ20 కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ తాజాగా పోస్ట్‌ చేసిన వీడియోకు బీసీసీఐ ఏమంటుందో చూడాలి. వివరాల్లోకి వెళితే.. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ అద్దం ముందు నిల్చుని మ్యాజిక్‌ ట్రిక్‌ను చేసింది.  (అతనికి గాయం.. నాకు ఒక జ్ఞాపకం!)

ఆ వీడియోలో హర్మన్ చేతిలో ఓ గాజు గ్లాసు అందులో బాల్ పట్టుకొని నిల్చొని ఉంది. ఆ బంతిని ఎదురుగా ఉన్న అద్దం వైపు విసరగా అది మళ్లీ హర్మన్‌ వైపు  రావడం గ్లాస్‌లో పడటం జరిగింది. అవతలి వైపు గ్లాస్‌లోకి వెళ్లి అక్కడ్నుంచి మళ్లీ హర్మన్‌ గ్లాస్‌లోకి రావడం టాప్‌ మ్యాజిక్‌గా నిలిచింది. ఈ వీడియోను ఎలా చేశానో చెప్పాలంటూ హర్మన్‌.. అభిమానులకు పజిల్‌ విసిరింది. అయితే అభిమానులు మాత్రం అది ఎలా సాధ్యం​ అనే విషయంలో పరేషాన్‌ అవుతున్నారు. హర్మన్‌ విసిరిన మ్యాజిక్‌ ట్రిక్‌ను కనుక్కొనే పనిలో తలలు పట్టుకుని అన్వేషణ సాగిస్తున్నారు.  ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఇందులో మ్యాజిక్‌ అనేదే ప్రధానాంశం కాబట్టి లాక్‌డౌన్‌ను ఆస్వాదిస్తున్న క్రికెట్‌ అభిమానులు ఎలాగైనా కనుక్కోవాలనే పనిలో​ ఉన్నారు. ప్రస్తుతం హర్మన్‌ మ్యాజిక్‌ ట్రిక్‌కు బౌల్డ్‌ అయిన ఫ్యాన్స్‌..  ఇందులోని అసలు విషయాన్ని కనుక్కోంటే మాత్రం హర్మన్‌ ‘బౌల్డ్‌’ కావడం ఖాయం.

Mirror, mirror on the wall, who the realest of them all.

A post shared by Harmanpreet Kaur (@imharmanpreet_kaur) on

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top