వార్నర్, లబ్‌షేన్‌ సెంచరీలు | Warner and Labuschagne Scored Century Against Pakistan | Sakshi
Sakshi News home page

వార్నర్, లబ్‌షేన్‌ సెంచరీలు

Nov 30 2019 12:54 AM | Updated on Nov 30 2019 12:54 AM

Warner and Labuschagne Scored Century Against Pakistan - Sakshi

అడిలైడ్‌: తొలి టెస్టులో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా రెండో టెస్టులోనూ అదే జోరు కొనసాగించింది. పింక్‌ బాల్‌తో ‘డే అండ్‌ నైట్‌’ టెస్టుగా సాగుతున్న ఈ మ్యాచ్‌ మొదటి రోజు ఆసీస్‌ అదరగొట్టింది. ఆట ముగిసే సమయానికి 73 ఓవర్లలో వికెట్‌ నష్టపోయి 302 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌ (228 బంతుల్లో 166 బ్యాటింగ్‌; 19 ఫోర్లు), మార్నస్‌ లబ్‌షేన్‌ (205 బంతుల్లో 126 బ్యాటింగ్‌; 17 ఫోర్లు) వరుసగా రెండో టెస్టులోనూ సెంచరీలు బాదారు. వార్నర్‌ కెరీర్‌లో ఇది 23వ సెంచరీ కావడం విశేషం. నాలుగో ఓవర్లోనే బర్న్స్‌ (4)ను షాహిన్‌ అఫ్రిది అవుట్‌ చేసిన తర్వాత వార్నర్, లబ్‌షేన్‌ చెలరేగారు.

Advertisement
 
Advertisement
Advertisement