వైరల్‌: మాంచెస్టర్‌ నీలిరంగుతో నిండిపోయింది! | Virat Kohli Says Manchester was Blue Today  | Sakshi
Sakshi News home page

వైరల్‌: మాంచెస్టర్‌ నీలిరంగుతో నిండిపోయింది!

Jun 28 2019 11:08 AM | Updated on Jun 28 2019 11:35 AM

Virat Kohli Says Manchester was Blue Today  - Sakshi

‘ఫుట్‌ బాల్‌ సంగతైతే నాకు తెల్వదు.. కానీ మాంచెస్టర్‌ మాత్రం నీలరంగుమయమైంది.

మాంచెస్టర్‌ : ‘ఫుట్‌ బాల్‌ సంగతైతే నాకు తెల్వదు.. కానీ మాంచెస్టర్‌ మాత్రం నీలరంగుమయమైంది.’ అని ఓ వీడియోను టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ అనంతరం గుంపుగా ఉన్న అభిమానుల మధ్య సెల్ఫీ వీడియో తీసుకున్న కోహ్లి.. అభిమానుల మద్దుతు పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం మాంచెస్టర్‌లో ఫుట్‌బాల్‌ లీగ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఇక కోహ్లి ఫుట్‌బాల్‌ ఆటకు విరాభిమాని అన్న విషయం తెలిసిందే. కోహ్లిలానే ఫుట్‌బాల్‌ అంటే ఇష్టపడే కేఎల్‌రాహుల్‌, విజయ్‌ శంకర్‌, దినేశ్‌ కార్తీక్‌, చహల్‌లు ఇటీవల ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌లోని మాంచెస్టర్‌ యూనైటెడ్‌ ఫుట్‌బాల్‌ స్టేడియాన్ని సందర్శించిన విషయం తెలిసిందే.(చదవండి: విండీస్‌నూ ఊదేశారు)

ఇక నిన్నటి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కోహ్లి కీలక ఇన్నింగ్స్‌తో పాటు చివర్లో ధోని మెరుపులు భారత్‌ను ఆదుకోగా, బౌలింగ్‌లో షమీ, బుమ్రాల సూపర్‌ ప్రదర్శన ఘన విజయాన్ని అందించాయి. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి (82 బంతుల్లో 72; 8 ఫోర్లు), ఎమ్మెస్‌ ధోని (61 బంతుల్లో 56 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేయగా... కేఎల్‌ రాహుల్‌ (64 బంతుల్లో 48; 6 ఫోర్లు), హార్దిక్‌ పాండ్యా (38 బంతుల్లో 46; 5 ఫోర్లు) రాణించారు. అనంతరం వెస్టిండీస్‌ 34.2 ఓవర్లలో 143 పరుగులకే ఆలౌటైంది. సునీల్‌ ఆంబ్రిస్‌ (31)దే అత్యర్థిక స్కోర్‌కావడం విశేషం. పేసర్లు షమీ (4/16), బుమ్రా (2/9), స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ (2/39) ప్రత్యర్థిని దెబ్బతీశారు. దీంతో భారత్‌ 125 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది.  

    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement