కోహ్లీ అవుట్.. | virat kohli out.. team india score 163/3 | Sakshi
Sakshi News home page

కోహ్లీ అవుట్..

Nov 7 2015 10:47 AM | Updated on Sep 3 2017 12:11 PM

దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ హోరా హోరీగా సాగుతోంది.

మొహాలి: దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ హోరా హోరీగా సాగుతోంది. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీం ఇండియా శనివారం ఆట మొదలై డ్రింక్స్ విరామ సమాయానికి మూడు వికెట్లను కోల్పోయి 162 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానే(1), పుజారా(76) బ్యాటింగ్ చేస్తున్నారు.

కాగా, అంతకుముందు వాన్ జిల్ వేసిన బంతికి విరాట్ కోహ్లీ(29) అవుటయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ గా వెనుదిరిగిన ఓపెనర్ శిఖర్ ధవన్ రెండో ఇన్నింగ్స్ లో కూడా పరుగులేమీ చేయకుండా పెవిలియన్ కు చేరిన విషయం తెలిసిందే విజయ్ (47) పరుగుల వద్ద రెండో వికెట్గా వెనుదిరగగా.. కోహ్లీ మూడో వికెట్ సమర్పించుకున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement