టెస్టు మ్యాచ్‌కు హాజరైన మాల్యా

Vijay Mallya arrives at Kia Oval to watch ENG vs IND final Test - Sakshi

లండన్‌: భారత్‌లో బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్‌లో ఉంటున్న వ్యాపార వేత్త విజయ్‌ మాల్యా శుక్రవారం భారత్‌-ఇంగ్లండ్‌ టెస్టుకు హాజరయ్యారు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య లండన్‌ వేదికగా చివరి టెస్టు నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు విజయ్‌ మాల్యా నేరుగా స్టేడియానికి వచ్చారు.

గత ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీ జరిగిన సమయంలోనూ భారత్‌ ఆడిన ప్రతి మ్యాచ్‌కు మాల్యా హాజరయ్యారు. ప్రస్తుతం కోహ్లి సేన ఇంగ్లండ్‌ పర్యటనలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆగస్టు 1న తొలి టెస్టు ప్రారంభమయ్యే ముందు టీమిండియాను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని కోరగా వారు తిరస్కరించారు. దీంతో మాల్యాకు కోహ్లి సేనను కలిసే అవకాశం దక్కలేదు. ఈ క్రమంలో మాల్యా లండన్‌ వేదికగా ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు మ్యాచ్‌కు హాజరయ్యాడు. మ్యాచ్‌ ప్రారంభానికి కొద్ది సమయం ముందు మాల్యా స్టేడియం లోపలికి వెళ్లాడు. దీనికి సంబంధించిన దశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

చదవండి: చివర్లో  చమక్‌...

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top