ఇరగదీసిన భారత కుర్రాళ్లు..

U19 World Cup India vs Australia, India beat Australia by 100 runs - Sakshi

క్రైస్ట్‌చర్చ్‌: అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో భారత కుర్రాళ్లు ఇరగదీశారు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ జట్టు 100 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించి శుభారంభం చేసింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విభాగాల్లో సత్తాచాటిన భారత కుర్రాళ్లు.. పటిష్టమైన ఆసీస్‌కు షాకిచ్చారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ జట్టు 328 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు పృథ్వీ షా(94;100 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), మన్‌జోత్‌ కార్లా(86;99 బంతుల్లో 12 ఫోర్లు 1 సిక్సర్‌) రాణించి విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 180 పరుగులు జోడించి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆపై శుభ్‌మాన్‌ గిల్‌(63; 54 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకోగా, అభిషేక్‌ శర్మ(23;8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్‌ ఝుళిపించడంతో భారత్‌ భారీ స్కోరు చేసింది.

అటు తరువాత 329 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా 42.5 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు శివం మావి, కమలేష్‌ నాగర్‌కోటిల దెబ్బకు చాపచుట్టేసింది. వీరిద్దరూ తలో మూడు వికెట్లతో ఆసీస్‌ పతనాన్ని శాసించారు. ఇక అభిషేక్‌ శర్మ, అన్‌కుల్‌ రాయ్‌ చెరో వికెట్‌ తీశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top