నేడు భారత్‌ VS పాకిస్తాన్ | Sakshi
Sakshi News home page

నేడు భారత్‌ VS పాకిస్తాన్

Published Sun, Feb 19 2017 1:46 AM

TodayIndia VS Pakistan

కొలంబో: మరో విజయంతో ఫైనల్‌కు చేరాలని భారత్‌... చిరకాల ప్రత్యర్థిపై ఈసారైనా గెలిచి ప్రపంచకప్‌ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలనే లక్ష్యంతో పాకిస్తాన్...ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ వన్డే క్రికెట్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఆదివారం ముఖాముఖి పోరులో తలపడనున్నాయి.

జూన్ లో ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచకప్‌ టోర్నీకి టీమిండియా ఇప్పటికే అర్హత సాధించింది. ఇప్పటి వరకు పాకిస్తాన్ తో ఆడిన ఎనిమిది మ్యాచ్‌లో్లనూ భారత్‌నే విజయం వరించింది. చివరిసారి ఈ రెండు జట్లు భారత్‌లో జరిగిన 2013 వన్డే ప్రపంచకప్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో తలపడ్డాయి.  
 

Advertisement
 
Advertisement
 
Advertisement